Description
రామాయణంలో మండోదరి పాత్ర
=========
రామాయణంలో మండోదరి రావణాసురుని భార్య. అద్వితీయ సౌందర్య రాశి. ఆమె తెలివితేటలు అపారం. మండోదరి దేవకన్య హేమ, విశ్వకర్మ మయబ్రహ్మకు గలిగిన పుత్రిక. రావణాసురుడు తనను మోహించి పెళ్ళాడాడు. మండోదరి కుమారుడు అప్రతిహత విజయరూపుడు ఇంద్రజిత్తు . మండోదరి కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమే గాదు అంతస్సౌందర్య రాశి. నీతి, ధర్మం కర్తవ్యాన్ని ప్రబోధం చేయగల మనస్తత్వం తనది. శ్రీమద్రామయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తే మరికొన్ని దానవకులానికి చెందినప్పటికీ మనవతకు ప్రతీకలుగా నిలుస్తాయి. రావణుని పట్టమహిషి మండోదరి అలాంటి తత్వంగల స్త్రీమూర్తి.
రావణాసురుడు తనను మోహించిన సమయంలో తండ్రి అంగీకరించకుంటే హతమార్చి అయినా తనను తీసుకెళతాడని గ్రహించి తండ్రి ప్రాణాలు కాపాడ్డం కోసం వివాహానికి అంగీకరిస్తుంది. రావణాసురుడు సీతమ్మను చెరబట్టి లంకకు తీసుకొచ్చినపుడు అతని చర్యను ప్రతిఘటించిన మొదటి వ్యక్తి మండోదరే. పరస్త్రీని వ్యామోహించడం తప్పే కాదు అనర్థదాయకమని చెబుతుంది. కానీ రావణాసురుడు వినడు. రాముడితో యుద్ధానికి బయలుదేరే చివరి క్షణంలో కూడా మండోదరి మించిపోయింది లేదు రాముడితో సంధి కుదుర్చుకోమని హితవు పలుకుతుంది. రామాయణంలో మండోదరి అపురూప సౌందర్యరాశిగా, రావణాసురుడి పట్టమహిషిగా, మానవత కలిగిన పరిపూర్ణ మహిళగా మనకు కనిపిస్తుంది. మండోదరి ఉదాత్తత గురించి మనతో చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు రామదుర్గం మధుసూదనరావు.
---
Send in a voice message: https://anchor.fm/simik/message