Description
కొందరు చికెన్, మటన్ కనిపిస్తే చాలు.. లొట్టలేసుకుని మరీ తినేస్తుంటారు. వెజిటేరియన్ అనగానే ఆమడ దూరం పరిగెడతారు. మరి, ఆరోగ్యానికి వెజ్ మంచిదా? నాన్ వెజ్ మంచిదా..? అంటే.. ప్యూర్ వెజ్ బెటర్ అని పెద్దలు చెప్పే మాట. అది కూడా డెయిరీ ప్రొడక్ట్స్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది అంటున్నారు. ఎందుకంటే.. మాంసాహరంతో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. కానీ.. కూరగాయలతో ఆ సమస్యే ఉండదు. బెండకాయల నుంచి కొత్తి మీర వరకు ప్రతి ఒక్కటీ బిందాస్‌గా తినేయొచ్చు. ఇదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన రవి కీర్తి. జంతువుల పట్ల ప్రేమ, దయ చూపిస్తే.. అవి మనతో అంతే స్నేహం గా ఉంటాయని ప్రూఫ్ చేస్తున్నారు. మిషన్ వేగన్ పేరిట.. రవి కీర్తి చేపట్టిన ప్రాజెక్ట్ కు ఫుల్ సపోర్ట్ లభిస్తోంది.. వెగనిసమ్, డెయిరీ ప్రొడక్ట్స్ కు దూరం గా ఉండే లాభాలను తెలుగు ప్రజలకు వివరిస్తున్నారు.. అసలు మిషన్ వేగన్ అంటే ఎంటి.. అనిమల్ ఫ్రెండ్లీ గా మార్చేందుకు ఉన్న ప్లాన్స్ ఎంటి.. మూగ జీవాలకు హాని కలిగిస్తే కలిగే నష్టాలేంటి.. ఇలాంటి అంశాలపై వెగనిసం ని స్ప్రెడ్ చేస్తున్న రవి కీర్తి తో సిమిస్ అవాలంచ్ లో చర్చిద్దాం
---
Send in a voice message: https://anchor.fm/simik/message
Support this podcast: https://anchor.fm/simik/support