Episodes
ఇవ్వాల్టి పార్ట్ 2 ఎపిసోడ్లో  సిజేరియన్ ,నార్మల్ డెలివెరీస్ లో అప్పుడే పుట్టిన  నవజాత శిశువులకు వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమిటి ?తల్లి బిడ్డల ఆరోగ్య రీత్యా ఎలాంటి డెలివరీ ఎలాంటి సందర్భాల్లో మేలు చేస్తుంది ?డెలివరీ సమయాల్లో  డాక్టర్స్ ఎదుర్కొనే ఇబ్బందులు  presures  ఏమిటీ ?అనే అనేక విషయాల గురించి   సునో ఇండియా వారి సమాచారం సమీక్ష  లో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు   డాక్టర్ . స్నేహ  గారి ఇంటర్వ్యూ లో వినండి . See sunoindia.in/privacy-policy for privacy information.
Published 10/30/22
దేశం లో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ ప్రసవాలలో కూడా పెరుగుదల రికార్డు చేసింది . సి. సెక్షన్ డెలివెరీస్దాదాపు 60% . కొన్ని జిల్లాలో ఇంకా ఎక్కువని రిపోర్ట్స్ . నేషనల్ సగటు 22% కంటే ,WHO permisable రేట్ 10-15 % కంటే ఎక్కువే .గత కొద్దీ కాలం గ తెలంగాణ ప్రభుత్వం సిజేరియన్ ప్రసవాలు తగ్గించి ,నార్మల్ డెలివెరీస్ ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది .ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి ?  ప్రజల ఆలోచన ,వైద్య రంగం లో వచ్చిన మార్పా ?ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్కువ...
Published 10/30/22
రక్తం  అంటే ఎర్రని రంగని తెలుసు . రక్తం చూస్తే  ఆందోళన , భయం కలగటం natural . రక్తం లో ఉన్న  groups,  classifications గురించిన అవగాహన అందరికి లేదు . అలాంటిది జన్యు పరమైన blood related  వ్యాధుల గురించి తలసేమియా గురించి ఎందరికి తెలుసు?ప్రజలలో  అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 8 వ తేదీన ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తలసేమియా అనేది జన్యు రక్త రుగ్మత, .  తలసేమియా ఉన్న పిల్లవాడు అలసట, బలహీనత, నెమ్మదిగా పెరుగుదల, పేలవమైన ఆకలి మరియు రక్తహీనత వంటి లక్షణాలను చూపుతాడు. చికిత్స రక్త...
Published 10/26/22
గత కొద్దికాలంగా  దేశం లో చిన్నారుల మీద లైంగిక అకృత్యాలు పెరిగిపోతున్నాయి . గర్ల్ లేదా బాయ్ సేఫ్ గ ఉండే పరిస్థితి లేదు .ఎప్పుడు ఎక్కడ  ఎవరు ఎలా ? పిల్లల ని abuse చేస్తారో తెలియదు . సేఫ్ గ చెప్పబడే స్కూల్ ,ఇల్లు వారి పాలిట నరకం గా మారుతున్నాయా ?పిల్లల అమాయకత్వం ,వయస్సు ని ఆసరాగా తీసుకుని నమ్మించి బెదిరించి సెక్సువల్ గా అబ్యూస్ చేస్తున్న సందర్భాలు అనేకం . abuse అయినా చైల్డ్ మానసిక ,శారీరిక  conditions సంగతి ఏమిటీ ? పిల్లలకు safe, unsafe టచ్ గురించి చెప్పటం ఎవరి భాద్యత ? ఎంత ముఖ్యం ?నేరం...
Published 10/21/22
140 కోట్ల జనాభా అందులో దాదాపు 60%  వ్యవసాయం వ్యవసాయ ఆధారిత రంగాల్లో పనిచేస్తారని అంచనా . కంట్రీ ఎకానమీ లో అగ్రికల్చర్ వాటా 2021 లెక్కల ప్రకారం  20. 19% . కరోనా పాండమిక్లో అనేక ఉత్పత్తి రంగాలు తాత్కాలికం గా మూతపడిన , వ్యవసాయ రంగం ఆదుకుందని తెలుసు .రైతే రాజు .లక్షల్లో బ్యాంకు బాలన్స్ ఉండేలా వ్యవసాయ రంగాన్ని  నిలుపుతామన్న హామీలు. రైతుల ఆశ లు  ఆకాంక్షలకు  షాక్ తగిలేలా  వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేర్పుల మూలంగా అగ్రికల్చర్ ,రైతుల కు దిక్కుతోచని  పరిస్థితులు  ఏర్పడ్డాయన్నది ఎంత నిజం ? కారణం ఏంటి...
Published 09/29/22
తెలంగాణ  ప్రాంత చరిత్రలో  సెప్టెంబర్ 17 కి ఒక గుర్తింపు ,ప్రాముఖ్యత ఉందని అందరికి తెలిసిందే . రైతులు చేసిన  తెలంగాణ సాయుధ పోరాటం  అంటారు . కమ్యూనిస్టుల  ప్రాబల్యం తో 1952 వరకు జరిగిన పోరాటం అంటారు .  నిజాం పాలనను వ్యతిరేకిస్తూ చేసిన ప్రజల పోరాటం అంటారు. దేశ స్వతంత్రం కోసం పోరాడినా  నిజాం పాలన నుండి ఫ్రీడమ్  దొరకనందున జరిపిన పోరాటం అంటారు. దేశ సమైక్యత లో భాగం కావటానికి జరిపిన  పోరాటం లేదా ఆక్షన్ డే  అంటే జాతీయ. సమైక్యతా దినం  అని ఒకరు తెలంగాణ  విమోచన దినం అని అనేక విధాలుగా  పిలుస్తూ  75...
Published 09/17/22
బిడ్డ ఆకలితో అల్లాడినా..  తల్లి మనసు అల్లాడిపోతుంది. అప్పుడే పుట్టిన పసికందులు తల్లిపాలు అందక ఆకలితో విలవిలలాడుతుంటే   మాతృహృదయం.. కుల, మత, పేద, ధనిక తేడాలకు అతీతంగా స్పందిస్తుంది. నేటి సాంకేతికత తల్లుల పిల్లల కోసం సాయపడుతోంది. పాలు మిగిలిపోయే బాలింతలు, బిడ్డలు దూరమైన తల్లులు చనుబాలను దానం చేస్తున్నారు. తల్లి  పాలు అందని పిల్లల కోసం  వేరే మహిళ Breast milk feed cheyyatam  మనకు  తెలుసు . శతాబ్దాలుగా వాడుకలో ఉన్నదే .  పుట్టగానే అనాథలుగా మారి సంరక్షణ కేంద్రంలో ఉన్న పసికందులు, వివిధ కారణాల వల్ల...
Published 08/31/22
దేశం 75 yrs of independence ని వేడుకగా జరుపుకుంది . ఇప్పటికి దేశం లో అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయి లో మౌలిక వసతులు అందుబాటులోకి రాలేదు . వాటిలో విద్యుత్ సరఫరా ఒకటి . విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాలు లేవనే  వాదనలో ఎంత నిజం ఉందొ  ఫ్యూ వీక్స్  బ్యాక్  రాష్ట్రపతి  గౌరవనీయులు ముర్ము గారి స్వగ్రామానికి  కల్పించిన కనక్షన్ ఉదాహరణ .విద్యుత్ వాడకం లేని జీవితాన్ని ,రంగాలను  ఊహించటం  కష్టమే . పవర్ కట్స్  మూలంగా అనుభవమే అయినా  ఎలక్ట్రిసిటీ  దేశ ఆర్ధిక ప్రగతికి , ప్రజల నిత్యా అవసరాలకు  అవసరం . పవర్  కట్స్...
Published 08/19/22
మర్రి ( ఫికస్ బెంఘాలెన్సిస్ ) 750 కంటే ఎక్కువ రకాల అత్తి చెట్లలో ఒకటి,బన్యాన్స్ పర్యావరణ లించ్‌పిన్‌లు. అవి అనేక రకాల పక్షులు,  గబ్బిలాలు,  మరియు ఇతర జీవుల కు ఆహారం అందిస్తాయి  మన జాతీయ వృక్షం.శతాబ్దాలుగా మనకు మేలు చేస్తున్న ట్రీ. దేశ సంస్కృతి లో భాగం. అలాంటి జాతీయ వృక్షం కి ప్రమాదం వచ్చింది. అదీ ఎక్కడంటే హరిత హారం కి పెట్టింది పేరుగా గర్వించే తెలంగాణలో. హైదరాబాద్ కి 45km దూరం లో చేవెళ్ల మన్నేగుడ మార్గం లో. 125 ఏళ్ల నుండి వందల సంఖ్యలో ప్రకృతి గొడుగు పట్టినట్లున్న చేవెళ్ల మర్రి చెట్ల...
Published 07/30/22
కోటి మందికి పైగా జీవనోపాధి కలిగిస్తున్న చేనేత రంగానికి గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏనాడు కూడా చేనేత రంగానికి  800 కోట్లకు మించి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు.  2011లో చేనేత కళాకారుల రుణమాఫీకి మరియు సహాకార సంఘాల పటిష్టత కోసం 6 వేల కోట్ల ప్రత్యేక   త్రిబుల్ ఆర్ (REVIVAL, REFORM AND RESTRUCTURING PACKAGE FOR HANDLOOM SECTOR) ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి 2825 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి  760 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మూడు ఆర్థిక  సంవత్సరాల (2011-2014)...
Published 07/18/22
భారతదేశంలో కేవలం 36 శాతం మంది మహిళలు మాత్రమే పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు. బహిష్టు సాధారణమైనది మరియు జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, అయినప్పటికీ భారతదేశంలోని బాలికలు మరియు మహిళలు ప్రతి నెలా periods time లో చాలా ఇబ్బందులు పడుతుంటారు. మన దేశంలో రుతుక్రమం ని  ఎక్కువ మంది  'శాపం', 'అశుద్ధం' మరియు 'మురికి' అని నమ్ముతున్నారు. సెన్సస్ 2011 జనాభా డేటా ప్రకారం, భారతదేశంలో దాదాపు 336 మిలియన్ల మంది బాలికలు మరియు మహిళలు ప్రతి నెలా 2-7 రోజుల పాటు పునరుత్పత్తి వయస్సు మరియు ఋతుస్రావం...
Published 06/29/22
1969 మాన్‌హట్టన్‌లోని స్టోన్‌వాల్ తిరుగుబాటును పురస్కరించుకుని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ మరియు క్వీర్ (LGBTQ+) ప్రైడ్ నెలను ప్రస్తుతం ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుపుకుంటారు. వేడుకల్లో ప్రైడ్ పరేడ్‌లు, పిక్నిక్‌లు, పార్టీలు, వర్క్‌షాప్‌లు, సింపోసియా మరియు కచేరీలు ఉన్నాయి మరియు LGBTQ ప్రైడ్ మంత్ ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పాల్గొనేవారిని ఆకర్షిస్తాయి అన్ని అంచనాల ప్రకారం, న్యూయార్క్ నగరంలో ప్రారంభమైన ప్రైడ్‌లో మూడు నుండి ఐదు వేల మంది ఉన్నారు మరియు నేడు న్యూయార్క్...
Published 06/15/22
హైదరాబాద్ నగర శివారులోని గండిపేట, హిమాయ తసాగర్ జలాశయాలున్నాయి. హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. ఈ రిజర్వాయర్‌ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. వీటి చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ.. 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం పలు వాటి చుట్టూ ఉన్న...
Published 03/30/22
2020 ప్రారంభం లో ఎవ్వరూ ఊహించని విపత్తు covid pandamic రూపంలో విరుచుకుపడింది. లైఫ్ మారిపోయింది. Schools ఆఫీసులు అన్నీ క్లోజ్. అనారోగ్యం భయం uncertenity. Covid pandamic విద్య వైద్యం ప్రజారోగ్యం వసతులు ఎంతటి తక్కువ స్థాయిలో ఉన్నాయి ప్రజలు ప్రభుత్వాలకు తెలిసేలా చేసింది. ఈ pandamic లో అన్నీ విధాల నష్టపోయింది స్టూడెంట్స్.కేజీ to PG మూతపడిన education institutes తో చదువు మూలపడింది. ఫిజికల్గా బోధన వీలవని స్థితి లో online Classes. దేశము లో ఎంతమందికి టీచింగ్ అందిందో ఖచ్చితం గా తెలీదు.టీవీ సెల్ ,...
Published 02/24/22
ప్రపంచం లో ఫస్ట్ GM crop పొగాకు 1982 లో. మనుషులు తినే పంటలో 1994 అమెరికాలో టొమాటో మొదటిది తరువాత సోయాబీన్  కార్న్  brinjal బొప్పాయి ఆలు చెరకు వరి పత్తి లాంటివి లిస్ట్ లో చేరాయి. GM పంటలో తెగుళ్లు తక్కువ. దిగుబడి పోషకాలు ఎక్కువ అనే ప్రచారం ఉంది. నిజమెంతో ఆయా దేశాల్లోని వ్యవసాయ నిపుణులు చెప్పాలి. GM పంటల సాగు, consumptionలో సమస్యలు ఉన్నాయనే అభిప్రాయం ఉంది.సాధారణం గా రైతు పండే పంట లోంచే విత్తనాలు తయారుచేసుకుని మళ్ళీ వాడుకుంటాడు.GM crops లో అది వీలుకాదు. రైతు కి ఆర్థికభారం విత్తన కంపెనీలపై...
Published 01/13/22
దేశం లో అనేక ప్రాంతాల్లో మనకు కనిపించే మెట్ల బావులు మోట బావులు చెరువులు కుంటలు నేడు పాడుబడిన అవి కొద్ది దశాబ్దాల కిందట వరకు ప్రజల సాగు నీటి తాగు నీటి అవసరాల కోసం ఎంతో ఉపయోగపడ్డాయి.ఇప్పుడు బావులు వాడకం తగ్గిపోయింది.దాదాపుగా కనిపించకుండా పోతున్నాయి. కారణాలు అనేకం. యునెస్కో అంచనా ప్రకారం ప్రపంచం లోనే అత్యధికంగా గ్రౌండ్ వాటర్ ను వాడే దేశం ఇండియా. 2007-2017 మధ్య కాలంలో దేశం లో భూగర్భ జలాలు 61% తగ్గాయని అంచనా.అందువల్ల మంచి నీటికే కాదు ఆహార భద్రత కు పెద్ద ప్రమాదం.వర్షపాతం లో 70% వరకు అనేక కారణాల...
Published 11/18/21
Right to information act సులువుగా చెప్పాలంటే RTI గా పిలవబడే సమాచార హక్కు చట్టం ప్రజలకు పార్లమెంట్ సాక్షి గా సిద్ధించిన గొప్ప చట్టం.ముఖ్య ఉద్దేశ్యం దేశం లోని అన్ని ప్రభుత్వ సంస్థలు ,ప్రభుత్వ పాలనలో పారదర్శకత ను పెంచటం. చట్టాల అమలులో పారదర్శకత accountability అవినీతిని అరికట్టడం ప్రజాస్వామ్యం ప్రజల కోసమే పనిచేసేలా చూడటానికి తగిన విధంగా ప్రజలను అప్రమత్తం గా ఉండేలా చెయ్యటమే చట్టం ఉద్దేశ్యం. 2005 లో పార్లమెంట్ లో ఆమోదం పొంది రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 (1)(a) ప్రకారం RTI చట్టం ప్రాథమిక హక్కు దేశ...
Published 10/30/21
ఆరోగ్యమే మహభాగ్యము అనే నానుడి సామెత అందరికీ తెలిసిందే.అది అక్షరసత్యం నిజం అని కోవిడ్ pandemic రుజువు చేసింది. వ్యక్తుల ఆరోగ్యం కుటుంబానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అవసరం. విద్య వైద్య ప్రజారోగ్య వసతులపై ప్రజలు ప్రభుత్వాలు చేసే ఖర్చు నీ మానవవనరుల అభివృద్ధి కి పెట్టుబడిగా చెప్పవచ్చు. అనారోగ్యానికి అనేక కారణాలు ఉండొచ్చు. పౌష్ఠికాహార లోపం పెరుగుతున్న కాలుష్యం అల్పాదాయ ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధ వనరుల లేమీ జనాభాకు తగినంతగా లేని వసతులు. తదితర వివిధ ప్రాణాంతక వ్యాధుల కారణంగా తీవ్ర అనారోగ్యం తో...
Published 10/19/21
గత కొద్ది సంవత్సరాలుగా మహిళలు బాలికల మీద జరుగుతున్న పెరుగుతున్న లైంగిక నేరాలు వేధింపులు హత్యలు అత్యాచారాలు. వీటిని అరికట్టే చట్టాలు ఉన్నా ,తరచుగా చూస్తున్న వింటున్న అనాగరిక డిమాండ్ సత్వర న్యాయం పేరుతో నేరస్థుడు అని అనుకున్న వారిని Encounter చేసి అయినా చంపాలి అని. న్యాయ విచారణ పద్ధతులను కాదని ఆటవిక న్యాయం కోరటం ఎంతవరకు సమంజసం? ఇలాంటి సంఘటనలు ఢిల్లీ నుండి గల్లీ దాకా అప్పుడప్పుడు చూస్తుంటాము. కొద్దిమంది ప్రజలు నాయకులనే వారు న్యాయం గురించిన అవగాహన లోపం లేదా vote bank politics కోసమో చేసే ఇలాంటి...
Published 09/30/21
కేవలం చేనేత వారోత్సవాలు మాత్రమే కాదు నిరంతరం  ప్రజలు వినియోగదారులు, సంస్థలు ప్రభుత్వాల నుండి కావాలి ఒక భరోసా. ఉత్పత్తులకు కావాలి సరైన ఆదరణ మార్కెటింగ్.ప్రతి ఊరు పట్టణం లో ఉండాలి చేనేత అమ్మకాలు.  తెలంగాణ రాష్ట్ర చేనేత ఉత్పత్తులుకు దేశవిదేశాల్లో పేరున్నది. పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, గొల్లభామ పట్టు నూలు చీరలు , వరంగల్ దర్రీలు , తువ్వాళ్ళు దుప్పట్ట్లు డ్రెస్సస్ ఒకటేంటి లిస్ట్ పెద్దది. చేనేత రంగం లో నేత కార్మికులు ఇతర అనుబంధ కార్మికులు 40533 కంటే ఎక్కువగా ఉన్నారు.పవర్ లూమ్స్ లో 36000...
Published 08/24/21
ఎన్నో ఊహలు ఆశలతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన మహిళలకు కాలక్రమం లో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల సరైన అవగాహన తక్కువే.ముఖ్యం గా భార్యాభర్తల దాంపత్యం గురించి.అన్నింటా సర్దుకుపోవటమే పరమావధి అనే సలహాలే ఎక్కువ.ఒకవేళ గృహహింస ముఖ్యం గా మారిటల్ రేప్ కి గురైతే ఏలా? ఎవర్ని సాయం అడగాలి?ఎక్కడ.ఎలా రిపోర్ట్ చెయ్యాలి? రేప్ కి మారిటల్ రేప్ కి లీగల్ పరిభాషలో ఉన్న తేడా ఏంటి?  మహిళల రక్షణకు ఉన్న చట్టాల అమలు ఎంతవరకు జరుగుతోంది.    గత కొద్ది రోజుల కిందట మారిటల్ రేప్ కేసు లో కేరళ హై కోర్ట్ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు...
Published 08/16/21
గత కొద్ది దశాబ్దాలుగా డిగ్రీలు అంటే engineering medicine లాంటివి మాత్రమే అందరి దృష్టి లో. పదవ తరగతి వరకు మొక్కుబడిగా చదివే చరిత్ర ను మరింతగా అధ్యయనం చేయాలనే కోరిక కలగటం అంటే ప్రస్తుత రోజుల్లో అదొక వింత.విదేశాల్లో బహుశా మామూలు విషయం కావచ్చు.వారికి  చారిత్రిక కట్టడాల పరిరక్షణ పట్ల ఉన్న శ్రద్ధ వల్ల. అలాంటి  పురాతత్వ శాస్త్రం చదువుతూ పిన్నవయస్సులో తెలంగాణ చరిత్ర నీ తెలిపే శిథిలాలు శాసనాలను వెతికి వెలుగులోకి తీసుకు వస్తున్న యువ  ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు అరవింద్ ఆర్య   d.చాముండేశ్వరి గారి తో...
Published 07/24/21
పరిసరాలలో పేరుకుపోయే అనేక రకాల వ్యర్ధాలను వేరుచేసి రీసైకిల్ చెయ్యటంలో చెత్త నుండి ఆదాయాన్ని క్రియేట్ చెయ్యటం లో ,waste management లో pioner అనదగిన waste picker గురించి మనకి తెలిసింది ఎంత?దేశం లో ఒక అంచనా ప్రకారం వీరు 1.5 నుండి 4 మిలియన్ల సంఖ్యలో ఉంటారు.దేశ ఆర్థిక కార్యకలాపాల్లో వీరి వాటా 3200కోట్లని అంచనా.urban waste management లో 20%వీరి ద్వారా రీసైకిల్అ వుతుంది అని మరో అంచనా. సమాజానికి హెల్ప్ చేస్తున్న వీరికి ప్రజలు ప్రభుత్వాలు నుండి అందే సహకారం ఎంత?సమస్యలు ఏంటి? Dalit Bahujan Resource...
Published 07/19/21
శరీరం చెప్పే లక్షణాలు ,హెచ్చరికలు వింటాము.వైద్యం తో ఆరోగ్యం కాపాడుకొంటాం, మరి మనస్సుకు కుంగుబాటు ఆందోళన ఒత్తిడి కలిగితే వచ్చే సూచనలు లక్షణాలు ఏమిటో సరిగ్గా తెలియదు. ఒకవేళ ఎవరైనా depressed గా ఉందంటే సరైన సలహా కంటే నీకేం సమస్య?అంతా బావుంటే .అంటూ మనసు చెప్పే మాట వినరు.విననివ్వరు. దానికి తోడు గత ఏడాదిన్నర గా వేధిస్తున్న కరోనా. Lockdowns,social distancing,work from home గందరగోళం మధ్య ఆందోళన అయోమయం తో మానసికం గా బెదిరిపోయిన ప్రజలు. మానసిక సమస్యలు mental health. అంటే నే చిన్న చూపు చూసే సొసైటీ లో...
Published 06/26/21